గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ ఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్.
-ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ. -విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
గంభీరావుపేట :గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ శ్రీకాంత్ ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేయడం జరిగిందని, ఈవిషయానికి సంబంధించి విచారణ నిమిత్తం వేములవాడ డీఎస్పీ ని విచారణ అధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితె ఒక ప్రకటనలో తెలిపారు. గంభీరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్ ని లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఎక్దం పత్రికలో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్ లపై గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంజరిగింది.అనంతరం వారిని అరెస్టు చేసి మంగళవారం రోజున పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి రిమాండ్ కి తరలించారని, ఎస్ఐ సిహెచ్. శ్రీకాంత్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ అధికారిగా వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు ను నియమించడం జరిగిందని, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు.ఈనేపథ్యంలో ఎస్ఐ ను తక్షణమే ఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేయడంజరిగిందని,విచారణ అధికారి సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, విచారణలో ఏ అధికారి తప్పు చేసినట్లు తేలినా శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


