వరి పంటను కబళిస్తున్న తెగుళ్లు - అప్రమత్తంగా ఉండాలన్న ఏవో - రైతుల పొలాల్లో సస్యరక్షణపై అవగాహన

వరి పంటను కబళిస్తున్న తెగుళ్లు - అప్రమత్తంగా ఉండాలన్న ఏవో - రైతుల పొలాల్లో సస్యరక్షణపై అవగాహన

బిజినేపల్లి(నాగర్ కర్నూల్):నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఈ దశలో పంటకు వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని మండల వ్యవసాయాధికారి ప్రసాద్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని వరి పొలాల్లో పర్యటించి, రైతులతో మాట్లాడి పంట పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట పొట్ట దశలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, దోమ, అగ్గి తెగులు, మెడ విరుపు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రైతులు ప్రతిరోజూ పొలాలను పరిశీలించుకోవాలని, తెగుళ్ల లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మందులను మాత్రమే తగిన మోతాదులో పిచికారీ చేయాలని, నకిలీ మందులు, అధిక మోతాదులో రసాయన మందులు వాడటం వల్ల పంటకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు, సమతుల్య ఎరువుల వాడకం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని, రైతు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తామని ఏవో ప్రసాద్ బాబు పేర్కొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News