అమ్మవారి ఆలయ గేట్లను ధ్వంసం చేసి మంగళసూత్రం మెట్టెలు ఎత్తుకెళ్లిన  దుండగులను 24 గంటల్లో పట్టుకోవాలి:

మేడ్చల్ మల్కాజ్గిరి  అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్థన్ రెడ్డి,

అమ్మవారి ఆలయ గేట్లను ధ్వంసం చేసి మంగళసూత్రం మెట్టెలు ఎత్తుకెళ్లిన  దుండగులను 24 గంటల్లో పట్టుకోవాలి:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :చింతల బస్తీలో నల్ల పోచమ్మ ఆలయం  సందర్శించిన గిరివర్ధన్ రెడ్డి  గుర్తుతెలియని దుండగులు అమ్మవారి ఆలయ గేట్లను ధ్వంసం చేసి, అమ్మవారి మంగళసూత్రం  మెట్లను దొంగలించినటువంటి దొంగల్ని 24 గంటల లోపల అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణలో 8 గుళ్ళల్లో దొంగతనాలు , గుడులు మీద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడమే   వారు యధావిధిగా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల లోపల పట్టుకోకపోతే తదుపరి కార్యాచరణ తెలియజేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సదానంద  పద్మ ప్రసాద్, గరిగే శేఖర్ ముదిరాజ్, కాలనీవాసులు  తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News