సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి నీటి వృథాను అరికట్టాలి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు

సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

చౌటకూర్ :- సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు గురువారం ఉదయం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వల పరిస్థితిని, తాగునీటి సరఫరాకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా పోలీసు అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.మిషన్ భగీరథ పథకం ద్వారా సుమారు 1,800 గ్రామాలకు తాగునీరు అందుతున్న నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, సరఫరా వ్యవస్థలో నీటి వృథాకు అవకాశం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ, భవిష్యత్తులో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వలు, తాగునీటి సరఫరా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News