గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్!
రాజన్న సిరిసిల్ల, : థర్డ్ డిగ్రీ ఆరోపణలపై డీఎస్పీ స్థాయి విచారణతుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు: ఎస్పీ మహేష్ బి. గితేగంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌పై వచ్చిన థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఎస్ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ ఘటనపై విచారణకు వేములవాడ డీఎస్పీ ఏ. శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఐ శ్రీకాంత్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే ఆరోపణలతో 'ఎక్దం' పత్రికకు సంబంధించిన పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్‌లపై గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం అక్టోబర్ 13న పోలీస్ స్టేషన్లో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రిమాండ్‌కు తరలించారనే ఆరోపణలు ఎస్ఐపై వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, విచారణ అధికారి సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


