జిల్లా పోలీస్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
కామారెడ్డి :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో మహిళా సిబ్బంది సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి, బతుకమ్మ పాటలతో వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారితో పాటు పోలీస్ అధికారులు, మహిళా పోలీస్ సిబ్బంది, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.అనంతరం జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్ పి కే నరసింహారెడ్డి కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్, ఏఅర్ డిఎస్పి ఉదయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు, రిసర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు, సిబ్బంది, మహిళా సిబ్బంది, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


