హుస్నాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక

హుస్నాబాద్‌లో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ జీవో జారీ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో హుస్నాబాద్ నియోజకవర్గంలో బాలబాలికలకు క్రీడల్లో శిక్షణకు అవకాశం 40 మంది క్రీడాకారులకు వసతితో కూడిన కబడ్డీ అకాడమీ ఏర్పాటు

హుస్నాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక

హుస్నాబాద్÷హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారి కృషితో హుస్నాబాద్ నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ అకాడమీ ఏర్పాటు కానుంది.కబడ్డీ అకాడమీ జీవోలోని ముఖ్యాంశాలు:- హుస్నాబాద్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి.
- అకాడమీలో మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నారు.- ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారు.- బాలురు, బాలికలకు వేర్వేరుగా కబడ్డీ కోచ్‌లను నియమించనున్నారు.
- బాలురు, బాలికల కోసం వేర్వేరుగా వార్డెన్లతో పాటు గ్రౌండ్స్‌మెన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డు సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.- మొత్తం 8 సేవల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- ఈ నియామకాలు ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు.క్రీడాకారులకు ప్రయోజనంఈ అకాడమీ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువ క్రీడాకారులకు కబడ్డీలో శిక్షణ పొందేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. బాలురు, బాలికలకు సమానంగా అవకాశం కల్పించడం ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడనుంది.హుస్నాబాద్ ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ అకాడమీ ఏర్పాటు కీలక అడుగుగా నిలవనుంది.ఇప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గంలోనీ గ్రామాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ గుర్తింపు సాధించారు. కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయవచ్చని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జీవో వివరాలు: G.O.Rt.No.1660, ఆర్థిక శాఖ (HRM.VII), తేదీ: 15-10-2026.మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాకారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంపై నియోజకవర్గ ప్రజలు , విద్యార్థులు , యువత స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News