ఎల్లారెడ్డిపేటలో అక్రమ మద్యం పట్టివేత
రాజన్న సిరిసిల్ల, :ఇద్దరి అరెస్ట్.. 38 మద్యం సీసాలు స్వాధీనంఅక్రమ విక్రయాలపై ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక దాడులుఎల్లారెడ్డిపేట మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. గొల్లపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆకుల స్వామి గౌడ్, కొండ శ్రీహరి గౌడ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 180 ఎంఎల్ పరిమాణం గల 38 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ విజయేందర్ రెండ్ల తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొల్లపల్లి, బొప్పాపూర్, గుండారం, తిమ్మాపూర్, పోతిరెడ్డిపల్లి, హరిదాస్నగర్, అగ్రహారం గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ మొహసిన్, కానిస్టేబుళ్లు మహేష్, కృష్ణాధర్, శ్రవణ్ పాల్గొన్నారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


