దాస్నాపూర్ దసరా రావణ దహనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, స్థానిక కౌన్సిలర్ చరణ్ గౌడ్

దాస్నాపూర్ దసరా రావణ దహనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, స్థానిక కౌన్సిలర్ చరణ్ గౌడ్

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోనిమావల మండలం దస్నాపూర్ రావణ దహనం మైదానాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గ మున్సిపల్ కమిషనర్,,వార్డ్ కౌన్సిలర్ చరణ్ గౌడ్, లతో కలిసి పరిశీలించారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే రావణ దహనం కార్యక్రమానికి వచ్చే ప్రజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గారు మాట్లాడుతూ.. రావణ దహనం మైదానాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్ వంటి యంత్రాల సహాయంతో శుభ్రపరిచే పనులు చేపడతామని తెలిపారు. అలాగే మైదానంలో ప్రజలకు అవసరమైన లైటింగ్, స్టేజ్ ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు తదితర సౌకర్యాలను మున్సిపాలిటీ తరఫున కల్పిస్తామని స్పష్టం చేశారు. పండుగకు వచ్చే ప్రజలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రావణ దహనం కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, మహిళలకు, భక్తులందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, హిందుస్థాన్ సమితి సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News