అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కొలువుతీరిన నూతన పాలకవర్గం  

పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గం సభ్యులు  అచ్చంపేట ః. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో 

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కొలువుతీరిన నూతన పాలకవర్గం  

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవ అనంతరం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది అచ్చంపేట పట్టణంలో మార్కెట్ యార్డులో నిర్వహించిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరైనారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌ శివ గౌడ్ తో పాటు పాలకమండలి డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరంనూతన పాలకవర్గ సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అచ్చంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ రాజేష్ రెడ్డి  మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ మార్కెట్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మార్కెట్ యార్డును అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తూ రైతులు పండించి పండించిన ధాన్యానికి భద్రత కల్పించేందుకు గోదాముల నిర్మాణం అనేక వసతులు కల్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు మార్కెట్లో బలోపేతానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉందని అన్నారు రైతులకు మార్కెట్లో అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పాలకమండలి పని చేయాలని సందర్భంగా పేర్కొన్నారుఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేందర్ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి మాజీ  ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 44

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News