మొకాశి ముండాల వద్ద ఘనంగా దసరా పూజలు
బెల్లంపల్లి మంచిర్యాల్ జిల్లా: కాసిపేటమండలంలోని దేవాపూర్, గాంధారి ఖిల్లా పొలిమేర ప్రాంతంలో కొలువై ఉన్న మొకాశి ముండాల వద్ద కోవ వంశ మొకాశీలు గురువారం దసరా పూజలనుసంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు, పటేళ్ల సహకారంతో అర్థరాత్రి వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి.తమ పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న ఆనవాయితీని ప్రతి ఏటా నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్నట్లు గాంధారి ఖిల్లా కోవ మొకాశి వంశీయుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోవ భాగుబాయి తెలిపారు. కోవ మొకాశీల వారసుడు కోవ సూరు మాట్లాడుతూ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ దసరా పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన మద్దిమడ, దేవాపూర్, తాటిగూడ గ్రామాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాసిపేట మండల రాయి సెంటర్ సార్మేడి కుంరం జనార్ధన్, ఆదివాసీ సేన జిల్లా ఉపాధ్యక్షుడు కొడప అనంత్రావు, ప్రధాన కార్యదర్శి పెంద్రం శంకర్, వివిధ గ్రామాల పటేళ్లు, యువకులు, కోవ పరివార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


