94 వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం గోల్ మాల్ - నాగర్ కర్నూల్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల కుంభకోణం బట్టబయలు
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కుంభకోణం కలకలం రేపుతోంది. మంతటి సమీపంలోని ఓ బాయిల్డ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో సివిల్ సప్లైస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, భౌతిక నిల్వలను పరిశీలించగా 3,774.818 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. అంటే సుమారు 94,370 బస్తాల ప్రభుత్వ ధాన్యం లెక్కల్లో తేడా ఉందని అధికారులు పంచనామా నిర్వహించారు. ఈ కొరత విలువ సుమారు రూ.9.68 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. KMS 2022-23, 2024-25, 2025-26 సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ కోసం అప్పగించిన ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించారా లేక దుర్వినియోగం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ దండు.రాజేందర్ ఫిర్యాదు మేరకు మిల్లు నిర్వాహకులు ఆకుతోట సాయిబాబు, సుదర్శన్ సహా మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


