దసరా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
సీఐ శంకర్ రావు, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్
నల్లబెల్లి, వరంగల్ జిల్లా : దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సీఐ శంకర్ రావు, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ సర్పంచ్ లకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.....గ్రామాల్లో ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా సర్పంచులు బాధ్యత తీసుకోవాలని కోరారు.ఉత్సవ నిర్వాహకులకు తగిన సూచనలు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


