గౌరారం గ్రామంలో ఘనంగా గ్రామీణ మహిళా దినోత్సవం

గౌరారం గ్రామంలో ఘనంగా గ్రామీణ మహిళా దినోత్సవం

బిజినేపల్లి(నాగర్ కర్నూల్)నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గౌరారం గ్రామంలో బుధవారం గ్రామీణ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలు తమ సమస్యలను వెల్లడించారు. వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసే చోట తమకు భద్రత లేదని, ఆరోగ్య సదుపాయాలు, సామాజిక భద్రత పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులలో స్త్రీలకు పురుషులతో సమాన వేతనాలు ఇవ్వాలని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలలో హక్కులు కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని కోరారు. పెన్షన్లు, ఆరోగ్య భీమా, ప్రసూతి ప్రయోజనాలు వంటి సామాజిక భద్రత సదుపాయాలు అర్హులైన మహిళలందరికీ ప్రభుత్వం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ మహిళల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళలకు ఆర్థికంగా, కుటుంబంలో, సమాజంలో సమాన గౌరవం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కె. తిరుపతయ్య, మహిళా కోఆర్డినేటర్ జె. ఈశ్వరమ్మ, యూత్ కోఆర్డినేటర్ ఏ. కవిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి వసంత, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ మరియు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News