మహిళలు, బాలికల భద్రతకు పెద్దపీట వేయాలి
షీ టీం, భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్
మెదక్ : మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిల్లా షీ టీం, భరోసా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షీ టీం పనితీరు, ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు, అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.
మహిళలు, బాలికలను వేధించే ఆకతాయిలపై నిరంతరం నిఘా ఉంచాలని, బస్టాండ్లు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అనంతరం భరోసా కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందిస్తున్న సేవలు, కౌన్సెలింగ్, ఫిర్యాదుల పరిష్కార విధానాలను పరిశీలించారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, వారి వివరాల గోప్యతను కాపాడాలని, సానుభూతితో వ్యవహరిస్తూ సత్వర న్యాయం అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీలో భరోసా ఎస్ఐ సుచరిత, భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, భరోసా కేంద్రం సిబ్బంది, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


