పెద్దగొట్టిముక్కలలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
శివంపేట : మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కల గ్రామంలో రైతుల సౌకర్యార్థం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఎం. నవీన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లాడి ఆంజనేయులు, పీఏసీఎస్ సీఈఓ గొల్ల మధు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


