తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం

WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM

 

హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు పింఛన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు సాధించేవరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉద్యమకారుల వలె తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం కావాలని మలిదశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.

 

WhatsApp Image 2026-03-01 at 5.48.03 PM

Views: 79

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News