తైక్వాండోలో నస్పూర్ క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక
నస్పూర్(మంచిర్యాల): బెల్లంపల్లిలో నిర్వహించిన జోనల్ స్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో అజయ్ ఉత్తమ ప్రతిభ చూపి అర్హత సాధించగా, అండర్-14 విభాగంలో శ్రీచైత్ర, స్నితిక రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తైక్వాండో మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకుబ్, క్రీడా ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లాకు మరింత గుర్తింపు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


