ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయాలని డీఈఓ కు వినతి
హత్నూర.: మండల పరిధిలోని గుండ్ల మాచునూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అజ్మత్ అలీ డిప్యూటేషన్ ను రద్దు చేయాలని కోరుతూ గుండ్ల మార్చినూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి ఉప సర్పంచ్ శంకర్ లు గురువారం నాడు జిల్లా విద్యాధికారి రోహిణి నీ కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీ యుపిఎస్ పాఠశాలలో ఇప్పటికే విద్యార్థులకు సబ్జెక్టులకు సరిపడ ఉపాధ్యాయుల లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే, ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పేరుతో బదిలీ చేయడం సరైనది కాదని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలా ఉపాధ్యాయులను తరచూ బదిలీ చేసుకుంటూ పోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కావున ఉపాధ్యాయుడు అజ్మత్ అలీ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేసి తిరిగి స్థానిక పాఠశాలలోనే ఉండేలా చూడాలని వారు డీఈఓ ను కోరారు. వార్డు సభ్యులు జగన్ యాదవ్, సంతోషా రమేష్ లు డిఈ ఓ ను కలిసిన వారిలో ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

