కలలోకనిపించిన తల్లి పెంట కుప్పలో వెలిసిన మైసమ్మ

దసరాకు అద్భుత ఆలయం కడతాం ఎమ్మెల్యే గంగుల హామీ

 కలలోకనిపించిన తల్లి  పెంట కుప్పలో వెలిసిన మైసమ్మ


కరీంనగర్, :  కరీంనగర్ కోతీరాంపూర్ లో మంగళవారం మైసమ్మ తల్లి బోనాల సందడి నెలకొంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన పెంట కుప్పలో అమ్మవారు వెలిశారని తెలియడంతో సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు లక్షలాది మొక్కులతో వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో కలిసి పూజలు చేశారు.కాలనీవాసులు తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. గంగుల కమలాకర్ స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకుని ఆలయం వరకు పాదయాత్ర చేసి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాలు, డప్పుల మోతతో ప్రాంతమంతా భక్తి మయమైంది. పూనకం వచ్చిన మహిళా భక్తురాలు ఇక్కడ శాశ్వత ఆలయం కావాలిఅని కోరగా, సానుకూలంగా స్పందించిన గంగుల కమలాకర్ వచ్చే దసరా నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం పూర్తి చేస్తానని ప్రకటించారు. ఎల్లమ్మ తల్లి కలలో కనిపించి పెంట కుప్పలో ఉన్నానని చెప్పడంతోనే మేము ఇక్కడ ప్రతిష్టించుకున్నాం" అని కాలనీవాసులు చెప్పారు. భక్తులు బోనాలు సమర్పించి, యాట పిల్లలతో మొక్కులు తీర్చుకున్నారుఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు జంగిలి ఐలందర్ యాదవ్, ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి తో పాటు వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News