సదాశివపేటలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్
వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి
- మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు శుభవార్త..
- తంగడపల్లిలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా
- వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మర్రిగూడ ఎస్సై బి.రాంబాబు
నల్గొండ /మర్రిగూడ:నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 'ఆసరా ఫౌండేషన్' ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27న తంగడపల్లిలో జరగనున్న ఈ మెగా ఉద్యోగ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మర్రిగూడ ఎస్సై బి. రాంబాబు శుక్రవారం ఆవిష్కరించారు.ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ మేళా జరగనుంది. ఈ వేదికగా వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి, సుమారు 3,000లకు పైగా ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయనున్నాయి.
అందుబాటులో ఉండే రంగాలు
తయారీ రంగం, బీపీఓ, ఐటీ-సాఫ్ట్‌వేర్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, రిటైల్-అమ్మకాలు మరియు మార్కెటింగ్ తదితర ప్రముఖ రంగాల్లో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించనున్నాయి.మునుగోడు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగం సాధించాలని ఆసరా ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దామెర ఉత్తరయ్య, జంపాల శ్రీకాంత్, దాసరి లక్ష్మణ్, పూదరి రాజు, గణేష్, నరేష్, మంగి మధు, కోరే సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


