ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు - ఎంపీడీఓ హెచ్చరిక

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు - ఎంపీడీఓ హెచ్చరిక

నాగర్ కర్నూల్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని బిజినపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) హెచ్చరించారు.బిజినపల్లి గ్రామానికి చెందిన పండ్లపాష అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని డబ్బులు తీసుకున్నాడని, బిజినపల్లి గ్రామానికి చెందిన చీర్ణం శివుడు తండ్రి జంగయ్య ఆరోపణ చేయగా, బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ నుండి వచ్చిన అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. ఇండ్ల మంజూరు కోసం సంబంధిత గ్రామ ఇందిరమ్మ కమిటీలు మరియు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని తెలిపారు.ఇల్లు మంజూరు నిమిత్తం అధికారులు గానీ, అనధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News