జీతం నుండి హౌస్ రెంట్ అలయన్స్ రికవరీ ఉపసంహరించుకోవాలి - కల్వ చక్రధర్

జీతం నుండి హౌస్ రెంట్ అలయన్స్ రికవరీ ఉపసంహరించుకోవాలి - కల్వ చక్రధర్

సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట జిల్లాలోని రెగ్యులర్ ఏం.పి.హెచ్.ఎ.(ఎఫ్) / ఏ.ఎన్.ఎం. ల వేతనాల నుంచి అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ నిలుపుదల చేస్తూ, జీతం నుండి అమౌంట్ రికవరీ చేయాలని సబ్‌ ట్రెజరీ ఆఫీస్ ఇచ్చే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించు కోవా లని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (3194) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కల్వ చక్రధర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిరంతరం సేవలందిస్తున్న ఏ.ఎన్.ఎం. ల వేతనాల నుంచి హెచ్.ఆర్.ఏ. రికవరీ చేయడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిద్దిపేట డి.టి.ఓ., దుబ్బాక ఎస్.టి.ఓ. లకు తగిన ఆదేశాలు జారీ చేసి, అడిషనల్ హెచ్.ఆర్.ఏ. ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ని కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించగా, సమస్యను నిశితంగా పరిశీలించి ఏ.ఎన్.ఎం. లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా డి.పి.ఓ. గా పని చేసి ప్రస్తుతం ఎన్.హెచ్.ఎం. ప్లానింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జగన్నాథ రెడ్డిని సైతం కలిసి సమస్య తీవ్రతను వివరించి, పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పుల్లగుర్ల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భూంపల్లి రాజు,  సిద్దిపేట జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు కాల్వ శోభ, గజ్వేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పిఆర్ఓ సురేష్, నాగేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు, యూనియన్ సభ్యులు, పద్మలత, స్వర్ణ, పుష్ప లత అనసూయ, ధనలక్ష్మి, పుష్ప పాల్గొన్నారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News