విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు

అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు

నాగర్ కర్నూల్,  : నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వ్యవసాయానికి సరైన సమయంలో విద్యుత్ సరఫరా అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో పంటలకు నీరు పెట్టే సమయంలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని సంబంధిత మంత్రిని కోరారు. వ్యవసాయ పనులకు నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో కీలకమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు సాగుకు అవసరమైన విద్యుత్, నీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు
టూ టౌన్ పాత పోలీస్ స్టేషన్ వెనుక ఉత్సాహంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాలు అధిక సంఖ్యలో హాజరైన మహిళలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ...
విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు
మర్రిగూడ మండలంలో విషాదం.
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు