చౌటకూర్‌లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం

చౌటకూర్‌లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం

  • చౌటకూర్ గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని
  • కన్నుల పండువగా సాగిన నిమజ్జన శోభాయాత్ర

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. చౌటకూర్ గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్రను నిర్వహించారు. డప్పులు, కోలాటాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు, కళాకారు ల విన్యాసాలతో నిమజ్జన శోభాయాత్ర సందడిగా సాగింది. కళాకారుల ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకు న్నాయి. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. శోభాయాత్ర సాగినంతసేపు ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో చౌటకూర్ మండల కేంద్రం మార్మోగింది. భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, గణేష్ నామస్మరణతో సందడి చేశారు.నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో చౌటకూర్‌లో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా, వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శంకర్, ఎమ్మార్వో అనుదీప్, గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, ఎస్సై విజయ్ కుమార్, ఎస్ఐ విశ్వనాథ్, మల్లికార్జున్ గౌడ్, కాంగ్రెస్ యువ నాయకులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు వర్కల రమేష్, నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు. 

Views: 254

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News