14,000 లంచం తీసుకుంటూ పట్టబడ్డ హాస్టల్ వార్డెన్
సత్యనారాయణపురం గిరిజన బాలుర వసతి గృహంలో ఘటన
చర్ల (భద్రాద్రి కొత్తగూడెం) మండలంలోని సత్యనారాయణపురంలో గల ఐటీడీఏ ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో కుక్ ఉద్యోగం ఇప్పించేందుకు లేదా ఆ ఉద్యోగం కొనసాగించేందుకు లంచం డిమాండ్ చేసిన హాస్టల్ వార్డెన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి, చర్ల మండలం సత్యనారాయణ పురం ఎస్టీ బాయ్స్ హాస్టల్ వార్డెన్‌గా భూక్యా వాల్ సింహ విధులు నిర్వర్తిస్తున్నారు, అదే హాస్టల్‌లో కుక్ పని చేయడానికి సంబంధించి రూ. 20,000 లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు, బాధితుడు అంత మొత్తంలో ఇవ్వలేనని అనడంతో చివరకు రూ. 14,000 కు ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ వ్యవహారంపై బాధితుడు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు, బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికను రచించారు, ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, వార్డెన్ భూక్యా వాల్ సింహ లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, ప్రస్తుతం మారుమూల ప్రాంతాల నుండి కూడా అవినీతికి వ్యతిరేకంగా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయని, అవినీతికి పాల్పడే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు, డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు కొనసాగుతాయని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నేరుగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


