నీరజ్ అపార్ట్‌మెంట్‌లో ఘనంగా కుంకుమ పూజ
మల్కాజ్గిరి : మౌలాలి డివిజన్ సాయినాధపురం వెంకటేశ్వర నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు, ఈ ఉత్సవంలో అపార్ట్‌మెంట్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులంతా ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


