వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ రాజర్షి షా

ప్రకృతి పూజతోనే సంస్కృతి పరిరక్షణ: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ : వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం భోరాజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతోవర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మండపంలో 2,100 దీపోత్సవ వేడుకలను మొదటి జ్యోతి వెలిగించి ప్రారంభించి, గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాంపూర్ గ్రామంలో ఇంత ఘనంగా, నిష్టతో గణేష్ ఉత్సవాలు జరగడం అభినందనీయమని కొనియాడారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదా యమని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగతా గ్రామాలు సైతం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి యంత్రాం గం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బాబు సింగ్, సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువజన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News