చౌటకూర్ మండలంలో చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన
383 మంది అభ్యర్థుల దరఖాస్తులకు వెరిఫికేషన్.. తాడాన్‌పల్లిలో పరిశీలించిన ఎంపీడీవో కే. శంకర్
చౌటకూర్, సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ కొనసాగుతోంది. మండల వ్యాప్తంగా మొత్తం 383 మంది అభ్యర్థులు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు ప్రత్యేకంగా వెరిఫికేషన్ అధికారులను నియమించారు.ఈ క్రమంలో శుక్రవారం చౌటకూర్ మండల పరిధిలోని తాడాన్‌పల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న చేయూత పెన్షన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను ఎంపీడీవో కే. శంకర్ పరిశీలించారు. వెరిఫికేషన్ అధికారి నాగసాయి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తున్న తీరును ఆయన ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వ నిబం ధనలను కచ్చితంగా పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా పారదర్శకంగా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఎంపీడీవో అధికారులకు సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ అధికారి నాగసాయి, పంచాయతీ కార్యదర్శి సిద్ధమ్మ, గ్రామ సర్పంచ్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


