రవీంద్రభారతిలో ప్రపంచ వెదురు దినోత్సవం
హైదరాబాద్: రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేదరి కులస్తులు వెదురుతో కళాత్మకంగా రూపొందించిన వివిధ రకాల వస్తువులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సంప్రదాయంగా వెదురుతో వస్తువులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మేదరి సమాజం నైపుణ్యాన్ని, కళాత్మకతను ఈ ప్రదర్శన చాటిచెప్పింది. కార్యక్రమంలో భాగంగా “మేదరి జీవన విధానం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. మేదరి సమాజం సంప్రదాయ వృత్తి, జీవన విధానం, వెదురు ఆధారిత కళలు, వృత్తి ప్రాధాన్యతను పుస్తకంలో పొందుపరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మేదరి సంఘం నాయకులు శ్రీనివాస్, రాజశేఖర్, ఉమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన మేదరి సంఘం ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షించడంతో పాటు మేదరి సమాజం ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

