గణపతిని దర్శించుకున్న బి.ఆర్.ఎస్. నాయకులు ఎన్.సి. సంతోష్

గణపతిని దర్శించుకున్న బి.ఆర్.ఎస్. నాయకులు ఎన్.సి. సంతోష్

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రోజు పూజా కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ లంబోదరుని దివ్య అనుగ్రహం ప్రజలందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మండపాన్ని నెలకొల్పి, ఎంతో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవా లను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తి భావంతో పాటు సామాజిక దృక్పథం తో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్న ఆటో యూనియన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ లోకల్ ఆటో యూనియన్ సభ్యులు, నాయకులు, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News