ప్రమాదకరంగా ధర్మారెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జి రోడ్డు
- అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేయాలి
- మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం నుండి చేగుంట వెళ్లే ప్రధాన రహదారి ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. సిమెంట్ రోడ్డు ధ్వంసమై ఇనుప రాడ్లు పైకి తేలడంతో నిత్యం ప్రయాణించే వందలాది మంది వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాం దోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి ఎలికంటి సురేష్, మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ చేగుంట పరిసర ప్రాంతాల్లో స్క్రాప్ దుకాణాలు ఉండటంతో ఈ మార్గంలో రోజూ భారీ వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్డుపై గుంతలు రోజురోజుకూ మరీ పెద్దగా మారుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించాలని, పనులు పూర్తయ్యే వరకు వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడం వదిలేసి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు దిగడం సరికాదు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి తగిన పరిష్కారం చూపాలన్నారు. ధర్మారెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వంజరి రాజు, మండల ప్రధాన కార్యదర్శిలు ఇప్ప స్వామి, బారు అరవింద్, మండల ఉపాధ్యక్షులు శివ మల్లు, శ్రీకాంత్ గౌడ్, బీజేవైఎం నాయకులు మహేష్ చారి, మండల నాయకులు రామస్వామి, మురారి లక్ష్మణ్, శ్రీరామ్ నగేష్, రాజు, సోషల్ మీడియా నాయకులు మణికంఠ ముదిరాజ్, నాయకులు మల్లేశం, వెంకటేష్, రాజు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

