మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మార్వోకు గజ్వేల్ రైస్ మిల్లర్స్ వినతి

మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

 

 

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఐఓసీ కార్యాలయంలో శుక్రవారం రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.బి. ప్రభాకర్  గుప్తా నాయకులు బాల నారాయణ మాట్లాడుతూ క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం రావడం లేదని, వెంటనే శాస్త్రీయంగా టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి ఖరీఫ్, రబీ పంటలకు వేర్వేరుగా అవుట్‌టర్న్ నిష్పత్తిని నిర్ధారించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎఫ్‌సిఐ కఠిన నిబంధనలను కొంత మేర సడలించాలని. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపివేయాలని, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేసినట్లయితే మేము కూడా వ్యతిరేకిస్తా మన్నారు. రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరపాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణ మైన ధాన్యాన్ని మాత్రమే సరఫరా చేయాలన్నారు. లేనిపక్షంలో ధాన్యం నాణ్యతకు తగినట్లుగానే బియ్యం నిష్పత్తిని నిర్ణయించాల న్నారు. రైసు మిల్లులను వ్యవసాయ అనుబంధ సంస్థలు గా గుర్తించి, 200 హెచ్.పి. వరకు విద్యుత్ సరఫరాను ఎల్.టి. కేటగిరీ కింద అందించాలన్నారు. 2014 నుంచి రావాల్సిన సివిల్ సప్లై మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్, డ్రైఏజ్ మరియు కస్టోడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలన్నారు. క్వింటాల్ ధాన్యానికి మిల్లింగ్ ఛార్జీని రూ.150 కి పెంచాలని, పాత గన్నీ బ్యాగ్ ధరను రూ.11గా నిర్ణయించాలన్నారు. 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని తక్షణమే మాఫీ చేయాలని, 2022-23 రబీ టెండర్ ధాన్యం ధరను న్యాయబద్ధంగా నిర్ణయించాలన్నారు. సి.ఎం.ఆర్ అగ్రిమెంట్‌ను ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పునఃరూపకల్పన చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి తోట చంద్ర శేఖర్, సభ్యులు మల్యాల వెంకటేశం, బిక్కుమల్ల సంతోష్ కుమార్, సతీష్, బచ్చు నాగరాజు, శివ, ప్రవీణ్, రాచర్ల శ్రీనివాస్, కుకునూర్ పల్లి నాగరాజు, అశోక్, వర్గల్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Views: 57

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News