ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ ధ్యేయం
గజ్వేల్ / సిద్దిపేట : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు తూప్రాన్ రోడ్డు, హెచ్.పి. పెట్రోల్ బంక్ వెనుక కాలనీలో ప్రతి సంవత్సరం వర్షపు నీరు నిలిచిపోతున్న సమస్యపై గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 15వ వార్డు బీజేపీ నాయకులు జోడు ప్రకాష్ ఆధ్వర్యంలో కమిషనర్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగిందన్నారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివ కుమార్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, సీనియర్ నాయకులు వెంకటేష్, గడియారం రాజేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.
Views: 43
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
