‘అత్యవసర పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో’

 రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద

‘అత్యవసర పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో’

 
 

మందమర్రి : ప్రస్తుతం నెలకొన్న వర్ష పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19,7 వార్డులలో నెలకొన్న స్థితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఎ.సి.పి.కిరణ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ రాజలింగు,ఎమ్మార్వో సతీష్ లతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్ష పరిస్థితులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర సేవలను అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే 7వ వార్డులో కూలిన ఇంటి గోడ స్థితిని పరిశీలించి సంబంధిత ఇంటి యజమానులకు పరిహారం అందించి ఇంటిని నిర్మించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
1010798608
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు