అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : పేద వర్గాల అభివృద్ది, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ శివారులోని కస్తూరిభా గాంధీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 2లక్షల 50వేలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరియు లక్షా 50వేలతో హైమాస్ లైట్లను ప్రారంభించారు. 40లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నమిలిగొండ గ్రామంలో 23లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి మరియు కోటి రూపాయలతో నిర్మించనున్న కూడా రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి సంబందించిన 38మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 38లక్షల 04వేల 408రూపాయల చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 22వేల 500కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 13వేల 500కోట్లతో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక పథకాలు పేద వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ ఆగస్టు 15నుండి రాష్ట్రంలో కొత్త వితంతు పెన్షన్లు మంజూరు కాబోతున్నాయని తెలిపారు. ఒక్క నమిలిగొండ గ్రామంలోనే కోటి 50లక్షల పనులు మంజూరు చేసుకున్నామని అన్నారు. వారం రోజుల్లో ఘన్‌పూర్ అశ్వరావుపల్లి, గండి రామారం రిజర్వాయర్ల ద్వారా రైతులకు సాగు నీరు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, నమిలిగొండ సర్పంచ్ కోమల, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.  
 
 
Views: 167

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు