కిట్స్ వరంగల్ విద్యార్థులు బహుళజాతి యథ్వా ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీలో ఎంపిక
హన్మకొండ న్యూస్ :03 సెప్టెంబర్ 2026న నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 'యథ్వా ఎనర్జీ సొల్యూషన్స్' (యాత్వ ఎనర్జీ సొల్యూషన్స్ )లో 'టెస్ట్ ఇంజనీర్' ఉద్యోగానికి ఎంపికైన ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈ ఈ ఈ ) విభాగపు ఏడుగురు బి.టెక్ చివరి సంవత్సరం విద్యార్థులను కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్ వరంగల్ ) గర్వంగా అభినందిస్తోంది. ఎంపికైన 2026-2027 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అకుల నాగరాణి, పోల రాహుల్, బొడ్డుల నీరజ్, నాగుల నీరజ్, కొత్త భగవాన్ రెడ్డి, సోమ చంద్ర తేజ్ మరియు తుమ్మ మణి రిత్విక్ అని ఫార్మర్ రాజ్యసభ, యం.పి., కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, చైర్మన్, కిట్స్ వరంగల్ వారు ఒక ప్రెస్ నోట్‌లో తెలిపారు. కిట్స్ వరంగల్ కోశాధికారి శ్రీ పి. నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ విజయం విద్యార్థుల అంకితభావం, సాంకేతిక సామర్థ్యాలు మరియు పరిశ్రమలో అర్థవంతమైన అవకాశాలను కల్పించేందుకు సంస్థ చేస్తున్న నిరంతర కృషిని ప్రతిబింబిస్తుంది. రాబోయే రోజుల్లో కిట్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సాంకేతిక ప్రపంచ దిగ్గజ యమ్. యన్. సి. కంపెనీలు సంసిద్ధత వ్యక్తం విద్యార్థినీ విద్యార్థుల కు సగర్వంగా హైలైట్ చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను నిర్వహించడానికి అనేక కంపెనీలు పైప్‌లైన్‌లో ఉన్నాయి అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లవేళలా తమ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ ఉద్యోగ సముపార్జన లో నిమగ్నము కావాలని కోరారు. ఈ యథ్వా ఎనర్జీ కంపెనీ వారు వ్రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్ & ఇంటర్వ్యూ రౌండ్ లను విజయవంతంగా 3 దశలలో నిర్వహించారు. ప్రస్తుత బి.టెక్. చివరి సంవత్సరం విద్యార్థులు ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అధిక సి టి.సి తో ప్లేస్‌మెంట్‌లను పొందడానికి స్థిరమైన అభ్యాసం, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యంఅని సగర్వంగా తెలిపారు. కిట్స్ కళాశాల యాజమాన్యం సభ్యులు, ఫార్మర్ రాజ్యసభ, యం.పి, కిట్స్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంతా రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి గారు, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, వి. సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, డీన్ ట్రైనింగ్ & ప్లేస్ మెంట్స్ ప్రొఫెసర్ వై. పురందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ఈ ఈ ఈ విభాగాదిపతి, డాక్టర్ ఎం. నరసింహారావు, టి.పి.ఓ. డా. సి హెచ్. సతీష్ చంద్ర, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ. కిరణ్ కుమార్, వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పి. ఆర్.ఓ. డా.డి. ప్రభాకరా చారి, ఆప్టిట్యూడ్ ట్రైనర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్ పవన్, జి. ధనుష్, డి శరత్, పి. సింధూర, వివిధ విభాగాల హెడ్‌లు, అందరు డీన్‌లు, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఎంపికైన 7 విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


