అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి...శ్రీకాంత్ గౌడ్
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీసులు మడక గ్రామానికి చెందిన ఉద్యమకారుడు,బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ ను గురువారం ఉదయం 5 గంటలకు అక్రమ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు,యువతకు అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు.టిఆర్ఎస్వియూత్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపినందుకు అక్రమంగా ఉదయం అరెస్టు చేశారన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు,విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని ఇవ్వకపోవడం,నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయాంబర్స్మెంట్ 12వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో యూత్ నాయకులు జొంగోని వెంకటేష్ గౌడ్,గడ్డం అజయ్ లు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


