గోదావరి పుష్కర ఘాట్ వద్ద అధ్వానంగా నీటి వసతులు:
తీవ్ర ఇబ్బందుల్లో భక్తులు
మంచిర్యాల టౌన్, మంచిర్యాల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద సౌకర్యాల లేమితో భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఘాట్ ప్రాంగణంలోని స్నానపు గదులకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు, ఏర్పాటు చేసిన కులాయిల నుండి నీళ్లు రాకపోవడంతో స్నానాలు చేయడానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పరిశుభ్రత, నీటి వసతి సరిగ్గా లేకపోవడంపై పలుమార్లు సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల నిత్యం గోదావరి ఘాట్‌కు వచ్చే భక్తులకు కనీస వసతులు కరువయ్యాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


