బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బడి మానేసిన బాలికలను పాఠశాలలో చేర్పించిన బిజినపల్లి ఎంఈఓ మైనుద్దీన్
నాగర్ కర్నూల్, బిజినపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో బడి మానేసి పంట పొలాల్లో పనులకు వెళ్తున్న ఇద్దరు బాలికలను గుర్తించి, వారిని తిరిగి చదువుల బాట పట్టించారు బిజినపల్లి మండల విద్యాధికారి (ఎంఈఓ) మైనుద్దీన్.బుధవారం లట్టుపల్లి గ్రామంలో ఇద్దరు బాలికలు బడి మానేసి పొలం పనులకు వెళ్తుండగా ఎంఈఓ మైనుద్దీన్ గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి బడికి వెళ్లకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, బడి బయట ఉన్న పిల్లలందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుకు విద్యాశాఖ అండగా ఉంటుందని తెలిపారు. తన ప్రత్యేక చొరవతో ఆ ఇద్దరు బాలికలను లట్టుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో లట్టుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

