గణపతి, నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.: ఎస్పీ

గణపతి, నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.: ఎస్పీ


బోథ్. :ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణపతి, నవరాత్రి  ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు   ముందస్తు చర్యల్లో భాగంగా బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో నాలుగు మండలాలకు బోథ్, బజార్హత్నూర్, నేరడిగొండ, సోనాల మండలాల గణపతి మండప నిర్వహక కమిటీ సభ్యుల సమావేశాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం బుధవారం సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మండప నిర్వహణ కమిటీలు సభ్యులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ, దానిని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ గణపతి విగ్రహాల ఏర్పాటు అనే పండుగ, ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని మండప నిర్వహణ కమిటీ సభ్యులను ఉద్దేశించి పలు సూచనలు చేయడం జరిగింది.  ఆన్లైన్లో వచ్చిన https://policeportal.tspolice.gov.in లింకు ద్వారా ప్రతి ఒక్క గణపతి మండపం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవాలని, దీని ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలలో చేయవలసిన బందోబస్తు కేటాయించవలసిన పోలీసు సిబ్బంది నిమర్జనం ఏర్పాట్లకు మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాలలో సాధ్యమైనంతవరకు ఒకే గణపతి మండపం ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్న భావాన్ని తెలియజేయాలన్నారు. గతంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేసే వారికి అనుమతులు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4  మండలాలలో ఏర్పాటు చేయనున్న గణపతి మండప నిర్వాహక కమిటీ సభ్యులు దాదాపు 250 మంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐ లు డి గురుస్వామి, సిహెచ్ రమేష్, ఎస్సైలు వి పురుషోత్తం, రమేష్, సిబ్బంది, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-10 at 12.23.04 PM (1)

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు