దళిత స్పీకర్‌పై బిఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు హేయం: గడ్డం పశుపతి
నార్కట్ పల్లి : దళిత సంఘాలను, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బిఆర్‌ఎస్ పార్టీ వైఖరిని సహించేది లేదని దళిత సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కుట్రలో భాగంగానే బిఆర్‌ఎస్ నాయకులు దళిత స్పీకర్‌ను అనుచిత పదజాలంతో దూషించారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులు నడిచిన బాటను పసుపు నీళ్లతో కడగడం బిఆర్‌ఎస్ నాయకుల అహంకారానికి, దళిత వ్యతిరేకతకు నిదర్శనమని వారు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి దళిత సమాజం తగిన బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ జిల్లా నాయకులు గడ్డం పశుపతి, స్వామి, మాదాసు నరసింహ, మేడి అశోక్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు జిల్లా పృథ్వీరాజ్, సర్పంచ్‌లు అనిల్ కుమార్ (జువ్విగూడెం), బోడ సత్యనారాయణ (తిరుమలగిరి), చెరువుగట్టు ఆలయ డైరెక్టర్ మహేష్, చింత మనోజ్, కాలపాక శివ, భాషపాక మత్స్యగిరి తదితరులు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


