బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల గుండెల్లో నిద్రపోయిన వీరనారి చాకలి ఐలమ్మ అని, 1919లో జన్మించి విసునూరు దేశ్‌ముఖ్ భూ ఆక్రమణకు వ్యతిరేకంగా "నా భూమిని దున్ననివ్వను" అంటూ పోరాడిన ధీరవనిత అని కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి, సాకలి శ్రీనివాసులు, తుమ్మలి అలోజీ, సతశిల సాగర్, రాజేందర్ గౌడ్, బాలస్వామి, బాల మాసయ్య, మంగి మురళి, ఎండి గఫూర్ పాల్గొన్నారు. రజక సంఘం నాయకులు బిక్కేరి శివ, సాయిబాబు, గోవిందు, రాజు, మల్లేష్, శ్రీనివాసులు, రిజ్వాన్, రాము తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


