పారిశ్రామిక పార్కు భూసేకరణపై అపోహలు వద్దు
- ఈడీ అటాచ్ చేసిన భూముల్లో 47.22 ఎకరాలే సేకరణకు ప్రతిపాదితం
- వాస్తవాలను పరిశీలించకుండా ప్రచురించిన కథనం సత్యదూరం
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ డెస్క్,: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని రాంపూర్ (టీ), గిమ్మ (బీ), గూడ, హత్తిఘాట్ గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చేపడుతున్న నాలుగు గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మొత్తం 2,062.01 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఎం/ఎస్ జి.ఎస్. బయోటెక్ సంస్థకు చెందిన కొన్ని భూములను రుణ బకాయిల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిందన్నారు అయితే, ఈడీ అటాచ్ చేసిన 500 ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తున్నట్లు కథనంలో పేర్కొనడం వాస్తవం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్‌సీఎల్‌టీ లిక్విడేటర్ అందించిన జాబితా ప్రకారం, ఈడీ అటాచ్ చేసిన భూముల్లో కేవలం 47.22 ఎకరాలు మాత్రమే ప్రస్తుత భూసేకరణ ప్రతిపాదనల్లో ఉన్నాయని తెలిపారు గ్రామాల వారీగా భూముల వివరాలు గూడ: 259.23 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 37.23 ఎకరాలు.రాంపూర్ (టీ): 333.38 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 9.39 ఎకరాలు,గిమ్మ (బీ): 274.09 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి లేదు మరియు హత్తిఘాట్: 1,149.11 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి లేదు మొత్తంగా 2,062.01 ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదించగా, అందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 47.22 ఎకరాలు మాత్రమేనని, భూములను సేకరిస్తున్నారంటూ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల భూ యజమానులు, ప్రజల్లో అనవసరమైన అపోహలు, ఆందోళనలు ఏర్పడే అవకాశం ఉందన్నారు భూసేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. భూమికి సంబంధించి ఏదైనా టైటిల్ వివాదం ఉన్నట్లయితే RFCTLARR చట్టం–2013, తెలంగాణ సవరణ చట్టం–2016 నిబంధనల ప్రకారం తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించిన వాస్తవాలను ప్రజలు గమనించాలని, అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


