మార్కెట్ యార్డ్ లో వసూళ్ల పర్వం

గాంధీ గంజ్ కూరగాయల వ్యాపారుల ఆవేదన.

మార్కెట్ యార్డ్ లో వసూళ్ల పర్వం

నిజామాబాద్ : గాంధీ గంజ్ లో కూరగాయల వ్యాపారుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని మాకు రవి ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఓమయ్య వసుళ్ళకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు.
నిజామాబాద్ జిల్లా గాంధీ గంజ్ లో చిల్లర కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న , నేను నమోదిత కూరగాయల వ్యాపారిని. గత 30 సంవత్సరాలుగా నా దివంగత తండ్రిగారి లైసెన్స్పై గాంధీ గంజ్లో చిల్లర కూరగాయల దుకాణం నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. అంతేకాకుండా, నిజామాబాద్ లోని రిజిస్టర్డ్ 'రిటైల్ గాంధీ గంజ్ వెజిటెబుల్ వెండర్స్ సొసైటీ' అధ్యక్షుడిగా సుమారు (13) సంవత్సరాలు సేవలు అందించడం జరిగిందన్నారు.. గాంధీ గంజ్ లోని చిల్లర కూరగాయల వ్యాపారుల సంక్షేమం కోసం చురుగ్గా పనిచేస్తూ, గత (15) సంవత్సరాలుగా వ్యాపారులందరికీ షాపుల శాశ్వత కేటాయింపు కోసం నా గళాన్ని వినిపిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులందరికీ దుకాణాలు కేటాయించేలా మార్కెట్ కమిటీ అధికారులను ఒప్పించాను. కానీ కొన్ని సాంకేతిక విధానపరమైన కారణాల వల్ల నాటి ప్రభుత్వం షాపులను కేటాయించ లేకపోయింది. అయితే, ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్  ముప్ప గంగా రెడ్డి నాపై కక్ష పెంచుకుని, నన్ను, మరికొందరు చిల్లర కూరగాయల వ్యాపారులను తొలగించి షాపులు కేటాయించేందుకు కుట్ర పన్నారు. అంతేకాకుండా, గత 30 ఏళ్లకు పైగా మా నాన్నగారి పేరిట ఉన్న మా లైసెన్స్ను రద్దు చేస్తామని ఇప్పుడు బెదిరిస్తున్నారు. నేను మార్కెట్ నుండి బయటకు వెళ్లి, మా లైసెన్స్ ను వదులుకుంటేనే నిజామాబాద్ గాంధీ గంజ్ లోని స్థలాన్ని తన అనుచరులకు కేటాయిస్తానని బెదిరింపులకు (బ్లాక్మెయిలింగ్) పాల్పడుతున్నారు.మేము  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ నామమాత్రంగా బహిరంగ వేలం నిర్వహించి, కేవలం (40) మందికి మాత్రమే స్థలం కేటాయించారు. వారిలో కూడా హెూల్ సెల్ లైసెన్స్ ఉన్న కొందరికి రిటైల్ లైసెన్స్ కూడా ఇచ్చి డబుల్ లైసెన్సులు కట్టబెట్టారు. నిజంగా వ్యాపారం చేసుకుంటున్న వారికి షాపులు కేటాయించకుండా, అసలు ఎలాంటి వ్యాపారం చేయని వారికి షాపులు కేటాయిస్తున్నారు. అంతేకాకుండా, తప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లను సృష్టించి, అసలు కూరగాయల దుకాణాలు పెట్టని/వ్యాపారం చేయని కొందరి పేర్లతో అటెండెన్స్ రిజిస్టర్లలో నకిలీ సంతకాలు (ఫోర్జరీ) చేశారు.ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ పదవికి అనర్హుడని, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అక్రమంగా మా వెండర్ లైసెన్స్ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అమాయకులైన పేద కూరగాయల వ్యాపారుల హక్కులను కాలరాస్తూ తన అనుచరులకు లబ్ది చేకూరుస్తున్నారని ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు