‘నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మందమర్రి, (మంచిర్యాల) : నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బుధవారం మందమర్రి సర్కిల్ కార్యాలయాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ లతో కలిసి తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమబద్ధంగా ఉంచడంతోపాటు వాటికి సంబంధించిన వివరాలను సక్రమంగా నిర్వహించాలని అలాగే పెండింగ్ కేసులను త్వరతగతిన పూర్తిచేయాలని సీఐ పర్ష రమేష్ ను సీపీ ఆదేశించారు. సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు,సిడి ఫైళ్ళను సిపి పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


