విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డిపేట రైతుల ధర్నా
గంభీరావుపేట : గంభీరావుపేటమండలంలోని మల్లారెడ్డిపేట రైతులు విద్యుత్ సమస్యలపై ఆగ్రహించారు. లింగన్నపేట సబ్స్టేషన్ దగ్గర కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన చేస్తున్నారు. పంటలు పారుకం లేక ఎండిపోతున్నాయని, లోవోల్టేజీతో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. డి ఈ తో ఎస్సై ఫోన్లో మాట్లాడించగా రెండు రోజులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ కీ ఏ ఈ ఆనంద్ రాగ నాణ్యమైన కరెంట్ను సరాఫరా చేస్తామని హామీ ఇచ్చరు. ఇట్టి ధర్నాలో రైతులు. గాండ్ల రాజాం, సందీప్ రెడ్డి, మెతుకు రాజు, పత్తేo ఆంజినేయులు, కొండం ఎల్లం, గుమ్మడి భిక్షపతి, మేకల నారాయణ, పాతూరి బాల్ రెడ్డి,మంద రవీందర్, శాదల రామచంద్రం, బండ దేవరాజు, రాజి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


