రైతులకు కరెంటు కష్టాలు
ఓకే ట్రాన్స్ఫారానికి స్థాయి కి మించిన కనెక్షన్ లు
లైన్ వైర్లు దాదాపు 100 సంవత్సరాల కి చెందినవి కావడంతో మళ్లీ మళ్లీ తెగి పడుతున్న కరెంటు వైర్లు.
మా కష్టాలను అర్థం చేసుకోండి సారూ అంటున్న రైతులు.
మహబూబ్‌నగర్ : నవాబ్‌పేట మండలం కొల్లూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సరిగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు వేళాపాళా లేక,చాలీచాలని కరెంట్ రావడం వల్ల *రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు: పంటలు ఎండిపోయే ప్రమాదం: సమయానికి నీరు అందక చేతికొచ్చిన పంటలు దెబ్బతిం టున్నాయి.మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం: లో-వోల్టేజీ తరుచుగా వచ్చే విద్యుత్ అంతరాయాల వల్ల బోర్ మోటార్లు కాలిపోయి రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతోంది. కేశవరావుపల్లి మైసమ్మ టెంపుల్ దగ్గర ఓకే ట్రాన్స్ఫారానికి అనేక మోటార్లు ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గర మళ్లీ మళ్లీ ప్రతి రోజుకి ఒక్కసా రైనా ఫీజు వైరు ఎగిరిపోవడం వల్ల కరెంటు రైతులను నష్టపరుస్తుంది. దయచేసి విద్యుత్ అధికారు లు స్పందించి రైతుల కష్టాలను అర్థం చేసుకోని విజన్ ఆంధ్ర పత్రిక ద్వారా అధికారులను విన్నవించుకుంటున్న రైతులు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


