వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?

వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?

  • హిందువులకు పండుగలు జరుపుకునే స్వేచ్ఛ లేదా?
  • బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి

ఎల్లారెడ్డిపేట,: వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటుపై పోలీసులు విధిస్తున్న ఆంక్షలు ఏమిటని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులు తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. వినాయక మండపాల నిర్వాహకులను అనుమతులు, నిబంధనల పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీజేలు, లైటింగ్, మండపాల నిర్వహణ తదితర అంశాలపై పోలీసులు యువకులను హెచ్చరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ప్రతిదానికీ పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హిందువులకు పండుగలు స్వేచ్ఛగా జరుపుకునే హక్కు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినాయక మండపాల నిర్వాహకులు, యువకులకు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసినా బీజేపీ వారి పక్షాన నిలబడి పూర్తిగా అండగా ఉంటుందని పొన్నాల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించాలని ఆయన కోరారు.

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు