బాల్కొండ వాసికి బెంగళూరు లో అరుదైన గౌరవం
బాల్కొండ, నిజామాబాదు : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బ్రాహ్మరౌతు నర్సింగ్ రావు కు బెంగళూరు లోని అక్కిపేట కు చెందిన ఆర్యా క్షత్రియ సంఘం వారు గురువారం రోజు ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా పూర్వ అల్లకొండ ఖిల్లా చరిత్ర తో పాటు శ్రీ నిమిషంభిక దేవి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. బి. ఆర్. నర్సింగ్ రావు రచించిన" అల్లకొండ - ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి " పుస్తక రూపంలో తీసుక రావడం అభినంద నీయమని,2003 నుండి శ్రీ సోమ / ఆర్యా క్షత్రియుల స్థితి గతులతో పాటు క్షత్రియ కుల దైవం అయిన నిమిషంభిక దేవి చరిత్ర ను బి. ఆర్. నర్సింగ్ రావు రచించిన" అల్లకొండ - ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి " పుస్తక రూపంలో తీసుక రావడం క్షత్రియ సమాజానికే గర్వ కారణమని అయన అభినందించారు.సృష్టి కంటే చరిత్ర గొప్పది సృష్టి కంటే చరిత్ర గొప్పదని పురాతన కట్టడాలను రక్షించు కొనే బాధ్యత సమాజం పై ఎంతో ఉందని అక్కిపేట లోని నిమిషంభిక దేవి ఆలయ అధ్యక్షులు కే.వెంకట సుబ్బా రాజు అన్నారు.ఆకాశంలో చుక్కలు వెలుస్తా యు సృష్టిలో ఒక కవి జన్మిస్తే ఆకాశంలో చుక్కలు వెలు స్తాయని - అలాగే గొప్ప నాయకులు మరణిస్తే ఆకాశం లోని చుక్కలు రాలుతాయని " అలాగే సృష్టి లో కవులు రచయితలు ఉన్నంత కాలం కళాకారులు రచించిన చరిత్రలే భావి తరాలకు గుర్తుండిపోయే విధంగా నిలిచి పోతాయని సంగం ఉపాధ్యక్షులు వి. రంగ రాజు అభిప్రాయ పడ్డారు. అలాగే చరిత్ర కట్టడాలు అంత రించి పోవడానికి (04) ప్రధాన కారణాలని కార్యదర్శి రవికాంత రాజు మాట్లాడుతూ వాటిలో 1).ఆయా ప్రాంతాల ప్రజలు చరిత్ర తెలుసుకోలేక పోవడం. 2).ప్రజల్లో ఐక్య మత్యం లేక పోవడం. 3).ఆయా ప్రాంతపు పూర్వ సాంకృతి, సాoప్ర దాయాలు వది లేయడం. 4).పూర్వ కట్టడాల రక్షణ కోసం ఆయా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పురాతన కట్టడాల పున : నిర్మాణాలు చేయక పోవడo వల్లనే పూర్వ కట్టడాలు స్థితిలావస్థలో ఉన్నాయని అయన ఆవేదన వ్యక్తo చేసారు.ఈ సందర్బంగా ఆలయ కార్యదర్శి ముక్త రాజు మాట్లాడుతూ బెంగళూరు సమాజంతో 14-03- 2003 నుండి సత్ సంబంధాలు కలిగి ఉన్నారని బాల్కొండ లోని శ్రీ నిమిషంభ దేవి విగ్రగాన్ని 2003 లో బెంగళూరు సమాజానికి చెందిన వి. ఆంజ నేయ రాజు,ఆర్. విశ్వనాథ రాజు, కే.దేవరాజు,వి గోవింద రాజు, ఎస్.విజయ రాజు, జి.లక్ష్మణ రాజు, ఎస్. అశోక రాజు,సి.లక్ష్మణ రాజు నెత్రుత్వంలో ప్రతిస్థాపన విగ్రహాన్ని బహుకరించడం విశేషమని అన్నారు.అనంతరం బాల్కొండకు చెందిన బి ఆర్. నర్సింగ్ రావు మాట్లాడుతూ బెంగళూరు సంగం మరియు ఆలయ కమిటీ ద్వారా నన్ను సన్మానించడం బెంగళూరు పెద్దలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు 2014 నుండి 2024 వరకు నిజామాబాదు లోని ప్రముఖ చరిత్ర కారులైన కందకుర్తి యాదవ రావు,సిద్ద సాయిరెడ్డి, కంకణాల రాజేశ్వర్ కలిసి అల్లకొండ ఖిల్లా చరిత్ర తో పాటు, బెంగళూరుతో పాటు గంజామ్ పట్టణం సమీపంలోని కావేరి నది ప్రక్కన గల నిమిషంభిక దేవి ఆలయాల చరిత్రను పుస్తక రూపంలో తీసుక రావడం జరిగిందని నర్సింగ్ రావు వివరించారు.ఈ కార్యక్రమంలో బెంగుళూరు కు చెందిన జనార్ధన రాజు, ఎన్. జయ ప్రకాశ్ రాజు, మల్లికార్జున రాజు, వి. సుబ్రహ్మణ్యం, విజయరాజు, లోకేష్ రాజు, బాల్కొండకు చెందిన బి. మణెమ్మ మాణీ రావు, బి. పావని సుధా పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


